Murder: ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న తండ్రి.. సడెన్గా ఎంట్రీ ఇచ్చిన కూతురు
Murder: మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తండ్రి చేతుల మీదుగానే తన సొంత కూతురు హత్యకు గురైన ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేస్తోంది. కుటుంబ వ్యవహారాల్లో చోటుచేసుకున్న విభేదాలు చివరకు అమాయక బాలిక ప్రాణాలను బలి తీసుకున్న ఘటనగా ఇది నిలిచింది. త్రిపురాంతకం గ్రామానికి చెందిన మోటుకట్ల శివారెడ్డి అనే వ్యక్తి బాజిబీల్ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తన కూతురు తులసికి తెలిసిన తర్వాత, ఆమె ఈ విషయాన్ని తన తల్లి ఈశ్వరమ్మతో పాటు బంధువులకు చెబుతుందనే అనుమానంతో తండ్రి క్రూర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు....