War Effect: లాక్డౌన్పై కేంద్రం క్లారిటీ?
War Effect: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, దేశంలోనూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్న భయంతో ప్రజలు ముందస్తుగా భారీగా కొనుగోళ్లు చేపడుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో పాటు నూనెలు, పప్పులు, ఇతర అవసరమైన సరుకులను నిల్వ చేసుకునే ధోరణి పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల కోసం పలుచోట్ల ప్రజలు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కారణంగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దేశంలో ఆహార పదార్థాలు, ఎరువులు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ, ప్రజలు...