APPSC Group 2: భారీగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా?

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తగా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను ప్రకటిస్తూ 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ క్యాలెండర్‌ను విడుదల చేయగా, మొత్తం పోస్టులను 4 విడతల్లో 41 నోటిఫికేషన్ల రూపంలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రూప్ 1కు 91 పోస్టులు, గ్రూప్ 2కు సుమారు 750 పోస్టులు కేటాయించబడగా, వీటి నోటిఫికేషన్ల విడుదల తేదీలను కూడా స్పష్టంగా ప్రకటించారు. గ్రూప్ 1...