ఇమ్యునోథెరపీ ప్రతి క్యాన్సర్ రోగికి కాదా?

క్యాన్సర్ అనే వ్యాధి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందిలో భయం నెలకొంటుంది. చికిత్స ఎలా ఉంటుంది, పూర్తిగా కోలుకోవచ్చా అనే అనుమానాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. అయితే వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధులతో కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా ఇమ్యునోథెరపీ ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ఒక ముఖ్యమైన మార్గంగా ఎదుగుతోంది. ఈ విధానం ద్వారా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేసేలా తయారు చేస్తారు. ఈ విధానానికి సంబంధించిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నప్పటికీ, ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేస్తుందా అనే ప్రశ్న ఇంకా...