Peddi: మాములుగా ఉండదు మరి!.. రామ్చరణ్ ఇరగదీశాడు భయ్యా (VIDEO)
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం “పెద్ది”పై సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సినీ రంగానికి చెందిన స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానం కలిగిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ వల్లే ఈ సినిమా మొదటి నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,...