Sun Preet Singh: సంగెం పోలీస్ స్టేషన్ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్
Sun Preet Singh: వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న ఆయనకు స్థానిక పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఆవరణలో మామిడి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై తన సందేశాన్ని ఇచ్చారు. స్టేషన్ శుభ్రత, నిర్వహణ, సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన, పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో సిబ్బందికి వివరించారు. తదుపరి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించిన కమిషనర్.. స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజల జీవన విధానం, ప్రాంతంలో నమోదవుతున్న నేరాల స్వభావం, రౌడీ...