Sri Rama Navami Special: ఈ పానకం తాగితే అనారోగ్య సమస్యలన్ని దెబ్బకు పరార్

Sri Rama Navami Special: శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తులు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడ అందించే పానకం కూడా అంతే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ పండుగ రోజు ప్రసాదాల కంటే పానకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. వేడి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా పానకం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లి ఈ పానకాన్ని తప్పక రుచి చూస్తారు. తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ పానకం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు...