PM Modi: రేపు సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం

PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం గల్ఫ్ ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెడుతోంది. ఈ పరిణామాల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు, వాయువు సరఫరాల్లో అంతరాయం ఏర్పడడంతో అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో కూడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27 శుక్రవారం ఆయన అన్ని...