Telangana: విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

Telangana: విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం, బలమైన భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో కీలక మార్పులను అమలు చేస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు మరో ముఖ్యమైన నిర్ణయంతో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం, గుడ్లు అందిస్తున్న ప్రభుత్వం ఇకపై విద్యార్థులకు చేపల కూరను కూడా వడ్డించాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో పెరుగుతున్న పోషకాహార లోపాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులకు మరింత పోషక విలువలు లభించనున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి వాకిటి...