Chiraya: మంచితనం ముసుగులో సైకో భర్త.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా

Chiraya: ఓటీటీ వేదికల్లో భిన్నమైన కథాంశాలతో వచ్చే చిత్రాలకు, సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భయం, ఉత్కంఠ, భావోద్వేగాలను కలిపిన కథలపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకులను లోతుగా ఆలోచింపజేసే ఒక కథతో వచ్చిన సిరీస్ చర్చనీయాంశంగా మారింది. వివాహం తర్వాత ఓ మహిళ ఎదుర్కొనే మానసిక, శారీరక వేధింపులను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ వేదికపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సైకో స్వభావం కలిగిన భర్త చేతిలో ఓ మహిళ ఎలా బాధపడుతుందనే భావోద్వేగ కథతో ఈ సిరీస్ రూపొందించబడింది. దివ్య దత్తా ప్రధాన పాత్రలో నటించిన ‘చిరాయ’...