Fish: ఆరోగ్యానికి పచ్చి చేపలు మంచివా?.. ఎండు చేపలు మంచివా?

Fish: నాన్ వెజ్ ఆహారం ఇష్టపడే వారికి చేపలు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి. చాలా మంది తాజా చేపలను ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ, ఎండు చేపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి మార్కెట్‌లో పచ్చి చేపలు, ఎండు చేపలు రెండూ లభ్యమవుతాయి. అయితే పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలలో పోషకాల సాంద్రత ఎక్కువగా ఉండడం విశేషం. రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఎండు చేపలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి అధిక ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరులు కావడంతో ఎముకల బలం పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం,...