Secret: శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?

Secret: శుభకార్యాలకు ముందు కొబ్బరికాయ కొట్టే ఆచారం సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక భావనను కలిగిన పూజా విధానంగా భావించబడుతోంది. పూజలు, హోమాలు, వివాహాలు వంటి శుభకార్యాల ప్రారంభానికి ముందు కొబ్బరికాయను సమర్పించడం ద్వారా ఆ కార్యం విజయవంతంగా, అడ్డంకులు లేకుండా సాగాలని ప్రార్థించే ఆచారం ఇది. ఈ విధానం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వస్తూ, భక్తుల విశ్వాసంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం.. కొబ్బరికాయకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. జగత్తు రక్షకుడైన విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఒక కొబ్బరి చెట్టు,...