Alcohol Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. బీర్ల ధరలు పెంపు!

Alcohol Prices: దేశవ్యాప్తంగా మద్యం వినియోగదారులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీర్ వినియోగదారులపై ప్రభావం చూపేలా ధరల పెంపు దిశగా తయారీ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, పన్నుల భారంతో కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. పన్నుల ప్రభావంతో ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంటూ కంపెనీలపై అదనపు భారం పడుతోందని వెల్లడించింది. బీర్ తయారీకి సంబంధించిన వివిధ ఖర్చులు ఒక్కసారిగా...