Andhra Pradesh: సీనియర్ సిటిజన్లకు ఉచిత కార్డులు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పెరుగుతున్న వృద్ధుల శాతాన్ని సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో అమల్లో ఉన్న జనాభా నియంత్రణ చట్టాలను రద్దు చేసి, జనాభా పెరుగుదలను ప్రోత్సహించే విధానాలపై దృష్టి సారించింది. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతను కేంద్రంగా చేసుకుని అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా వృద్ధులకు సౌకర్యాలు మెరుగుపరచడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వృద్ధులకు సులభంగా సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను...