కొత్త పథకం: కేంద్రం నుంచి ప్రతీ నెలా రూ.3 వేలు

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ సహాయకులు వంటి వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం అందించేలా నెలకు రూ.3000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఉద్యోగ విరమణ అనంతరం ప్రతీ నెలా ఈ పెన్షన్ అందడం ద్వారా జీవన భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసి, నిర్దిష్ట మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ...