Murder Case: మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా..?

Murder Case: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. పట్టణ శివారులోని ఎర్రకోట గ్రామం సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఒక యువకుడిని అమానుషంగా హత్య చేసిన తీరు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. జిన్నింగ్ మిల్లు ఎదుట ఉన్న పంటపొలంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన బయటపడింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. మొదటి చూపులోనే ఇది అత్యంత క్రూరమైన హత్యగా భావించిన పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక...