Andhra Pradesh: పాఠశాలలో త్రాచుపాము కలకలం
Andhra Pradesh: ఏపీలోని మార్కాపురం జిల్లాలోని పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెంలో ఉన్న మండల పరిషత్ పాఠశాలలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా విద్యార్థులతో కళకళలాడే ఈ పాఠశాలలో ఒక్కసారిగా త్రాచుపాము ప్రత్యక్షమవడంతో ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం రోజున వంటగదిలో తచ్చాడుతూ కనిపించిన ఈ పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. వంట పనుల్లో నిమగ్నమైన సిబ్బంది ఒక్కసారిగా పామును గమనించి భయంతో కేకలు వేయడంతో పరిస్థితి కలవరపరిచింది. వెంటనే వారు ఉపాధ్యాయులకు సమాచారం అందించగా, అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటన కారణంగా కొంతసేపు పాఠశాల వంటగదిలో కార్యకలాపాలు...