Tonga: 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్
Tonga: ఓషియానియా ప్రాంతంలోని టోంగా సమీపంలో ఉన్న నెయాఫు వద్ద మంగళవారం 24వ తేదీన ఉదయం భారీ భూకంపం సంభవించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం సముద్ర గర్భంలో ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 235 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో సంభవించడం వల్ల ఉపరితలంపై ప్రభావం కొంత మేర తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. టోంగా దేశం మొత్తం 171 ద్వీపాలతో కూడిన ద్వీప సమూహంగా ఉండి, ఆస్ట్రేలియా తూర్పు తీరానికి సుమారు 3500...