Biscuits: ఇవి మీ శరీరానికి నిశబ్ద శత్రువులు!

Biscuits: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన తినుబండారాల్లో బిస్కెట్లు, కుకీలు ముందుంటాయి. ముఖ్యంగా టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్ తినడం చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ బిస్కెట్లలో మైదా, అధిక చక్కెర, కృత్రిమ పదార్థాలు ఉంటాయని భావించి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు ఇంట్లోనే కుకీలు తయారు చేసుకుని తినడం ప్రారంభించారు. అయితే పోషకాహార నిపుణుల హెచ్చరికల ప్రకారం ఇంట్లో తయారుచేసిన బిస్కెట్లు అయినా ప్రతిరోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని స్పష్టమవుతోంది. బయటవి కంటే మెరుగైనవే అయినా, ఇవి కూడా అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా...