Ashni Platoon: ఆధునిక యుద్ధంలో సరికొత్త గేమ్ ఛేంజర్!
Ashni Platoon: ఆధునిక యుద్ధ స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి పశ్చిమ ఆసియా ఘర్షణల వరకు ప్రతి యుద్ధరంగంలో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ మార్పులను సమయానికి గుర్తించిన భారత సైన్యం తన యుద్ధ వ్యూహాలను ఆధునీకరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి సైనికుడిని డ్రోన్ యోధుడిగా తయారు చేసే లక్ష్యంతో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా ప్రతి సైనికుడు తన సాధారణ ఆయుధంతో పాటు డ్రోన్‌ను కూడా సమర్థవంతంగా వినియోగించగలగేలా శిక్షణ అందిస్తున్నారు. భవిష్యత్ యుద్ధరంగంలో ప్రతి సైనికుడి చేతిలో ఒక డ్రోన్ ఉండే విధంగా ప్రణాళికలు...