Andhra Pradesh: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు గుడ్న్యూస్!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం వెలువడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 సంవత్సరాల పదవీ విరమణ పరిమితిని 62 సంవత్సరాలకు పెంచే దిశగా కేబినెట్ సబ్ కమిటీ అనుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ...