నిరుద్యోగులకు అలర్ట్.. కొత్త DSC 2026 నోటిఫికేషన్ విడుదల తేదీ ఇదే..

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. మొత్తం 10,060 ఉద్యోగాలతో కూడిన విస్తృత జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ నియామకాల ప్రక్రియకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ జాబ్ క్యాలెండర్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విడుదల చేయడం విశేషం. ఇందులో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ తేదీలను ముందుగానే ప్రకటించడం ద్వారా అభ్యర్థులకు ముందస్తు అవగాహన కల్పించారు. మొత్తం 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ, పోలీసు నియామకాలను మినహాయించి మిగతా అన్ని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని...