ఒకే ఇంట్లో 5 మృతదేహాలు.. అసలేం జరిగింది?
కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరంలో హృదయాన్ని కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. మార్చి 21న వడుతల ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతదేహాలు బయటపడటంతో ఆ ప్రాంతం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇందులో 3 చిన్నారులు ఉండటం మరింత విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై ప్రాథమికంగా పోలీసులు ఇది సామూహిక ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇద్దరు మహిళలు ముందుగా తమ పిల్లలకు విషం ఇచ్చి, అనంతరం తాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనకు గల అసలు కారణాలను వెలికితీయడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను 58 ఏళ్ల...