Be careful: ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్!
Be careful: వాహనదారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటివరకు ట్రాఫిక్ చలాన్లను పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తూ, తర్వాత చూసుకుంటాం అనే నిర్లక్ష్య ధోరణి కొనసాగించిన వారికి ఇకపై భారీ సమస్యలు తప్పవు. పెండింగ్లో ఉన్న చలాన్లను ఎప్పుడైనా చెల్లించొచ్చని భావిస్తూ కాలం గడిపేవారికి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక నుంచి చలాన్లను నిర్లక్ష్యం చేస్తే నేరుగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్పై ప్రభావం పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు వాహనదారులపై మరింత కఠినంగా అమలు చేయబడనున్నాయి. ఇప్పటి వరకు కేవలం జరిమానాలతో సరిపెట్టిన వ్యవస్థను మరింత కట్టుదిట్టం...