Trump: ఈసారి దెబ్బ గట్టిగా ఉంటుంది.. ఇరాన్‌కు వార్నింగ్!

Trump: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఇప్పటికే 22 రోజులు పూర్తయ్యాయి. ఈ ఘర్షణ ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించినప్పటికీ, ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరా లోపం కారణంగా అనేక దేశాలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చిన్న దేశాలు ఆర్థికంగా కుదేలవుతుండగా, అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా కూడా పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అక్కడ ప్రజలు పెరిగిన ఇంధన ధరలపై...