Bhadrachalam: రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!
Bhadrachalam: దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాద్రి క్షేత్రం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందడితో కళకళలాడుతోంది. అంకురార్పణతో ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక ఉత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆలయం పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణతో రామాలయం రాత్రివేళల్లో మరింత దివ్యంగా మెరిసిపోతోంది. మార్చి 27న సీతారాముల తిరు కల్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం గమనార్హం. మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు....