CP Sajjanar: ఆడపిల్లల పాలిట శాపంగా మారుతున్న స్మార్ట్‌ఫోన్

CP Sajjanar: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా విస్తరణ యువతకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టినప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ముప్పును కూడా పెంచుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆన్‌లైన్ గుర్తింపులతో మోసగాళ్లు చేరువవుతున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని, నమ్మకం పొందిన తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించి, చివరికి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలలో ఆకర్షణీయమైన ఫోటోలు, సినీ ప్రముఖుల చిత్రాలను...