Abdul Basit: ‘మా టార్గెట్ భారతదేశం మాత్రమే’
Abdul Basit: పాకిస్థాన్‌లోని ఉన్నత విద్యావంతుల వర్గాల్లో కూడా తీవ్రవాద భావజాలం ఎంత లోతుగా వ్యాపించిందో తెలియజేసే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీ నగరంలో పాకిస్థాన్ తరఫున హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాలు పాకిస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే, దానికి ప్రతీకారంగా భారతదేశంలోని ప్రధాన నగరాలపై నేరుగా దాడులు జరిపే అవకాశాన్ని ఆయన బహిరంగంగా ప్రస్తావించారు. అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఒక ఊహాత్మక ఘర్షణ జరిగిన సందర్భంలో, పాకిస్థాన్‌కు భారతదేశమే సహజ లక్ష్యంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించడం మరింత...