Raghuram Rajan: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
Raghuram Rajan: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్న అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే అంశమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘర్షణ ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై స్పష్టంగా కనిపిస్తున్నదని, దాదాపు 15 నుంచి 20 శాతం వరకు సరఫరా అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు తమ నిల్వలను వినియోగిస్తూ తాత్కాలికంగా పరిస్థితిని నియంత్రిస్తున్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘంగా సాగితే...