Summer Plants: ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలు

Summer Plants: రోజురోజుకీ పెరుగుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు భగ్గుమంటుండటంతో, చల్లదనం కోసం ప్రజలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇళ్లలో ఏసీలు, కూలర్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. అయితే ఇవి నిరంతరం ఉపయోగించడం వల్ల విద్యుత్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ పద్ధతులతో ఇంటిని చల్లగా ఉంచుకోవడం అత్యంత ప్రయోజనకరంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో లేదా బాల్కనీల్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచడం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడటమే కాకుండా, తేమ స్థాయిలు పెరిగి ఇంటి వాతావరణం సహజంగానే చల్లగా మారుతుంది. ఇది తక్కువ ఖర్చుతో, సులభంగా అమలు చేయగల మార్గంగా నిపుణులు...