Tongue Condom: శృంగార ప్రియుల కోసం అందుబాటులోకి మరో కండోమ్
Tongue Condom: శృంగార ఆరోగ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రకాల రక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు పురుషులు, మహిళలు ఉపయోగించే కండోమ్‌లతో మాత్రమే పరిమితమైన రక్షణ పద్ధతులు ఇప్పుడు మరింత విస్తరించాయి. తాజాగా ‘నాలుక కండోమ్’ అనే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి రావడం శృంగార ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని టంగ్ స్లీవ్స్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా నోటి ద్వారా జరిగే శృంగార ప్రక్రియల్లో రక్షణ కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈ విధానంలో వ్యాధుల నుంచి రక్షణకు స్పష్టమైన మార్గాలు లేకపోవడంతో, ఇప్పుడు ఈ కొత్త ఉత్పత్తి ఆ లోటును భర్తీ చేస్తున్నట్లు...