అదృష్టం అంటే ఇదేనేమో!.. బోరు బావి నుంచి వచ్చిన గ్యాస్‌తో పదేళ్లుగా ఫ్రీ గ్యాస్
కేరళ రాష్ట్రంలోని అలప్పుర ప్రాంతానికి చెందిన రెత్నమ్మ అనే మహిళ గత 10 ఏళ్లుగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ కొనకుండా వంట చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సాధారణంగా ఇంట్లో వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ లేదా ఇతర ఇంధనాలపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే రెత్నమ్మ మాత్రం తన ఇంటి పెరట్లో నుంచే వెలువడుతున్న సహజ వాయువుతో గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకుంటూ అరుదైన ఉదాహరణగా నిలిచారు. 2011లో తన ఇంటి అవసరాల కోసం బోరు బావి తవ్వించిన సమయంలో నీరు రాకపోవడంతో ఆమె నిరాశ చెందారు. కానీ అదే బోరు ఆమె జీవితంలో ఊహించని మార్పుకు కారణమైంది. బోరు పైపును మూసివేసే సమయంలో...