Mulkanur: భక్తులకు ఆలయ కమిటీ ఆహ్వానం
Mulkanur: ముల్కనూర్ గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం అందించింది. గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27-03-2026 శుక్రవారం రోజున నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:45 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామస్థులు సమిష్టిగా కృషి చేస్తున్నారని, ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. ఈ...