Budget 2026-27: రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Budget 2026-27: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతం అనే లక్ష్యాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టగా, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ రూపొందించబడింది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా విభాగాల వారీగా నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్‌లో భాగంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ...