Telangana Budget: 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం

Telangana Budget: తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌ను రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం రూ.3,24,234 కోట్ల పరిమాణంతో ఈ బడ్జెట్‌ను ప్రకటించడం జరిగింది. ఇందులో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని కీలక పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రాష్ట్రంలోని పేద, ధనిక, మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు “ఇందిరమ్మ...