Telangana Budget: కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు
Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి పెద్ద ఎత్తున ఊరటనిచ్చే చర్యలను ప్రకటించింది. ముఖ్యంగా ఇప్పటివరకు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని అర్హత కోసం ఎదురుచూస్తున్న సుమారు 2 లక్షల మందికి ఈ...