Home Loan: 20 ఏళ్ల హోమ్ లోన్ 12 ఏళ్లలోనే ఖతం.. ఎలా అంటే?

Home Loan: మధ్యతరగతి కుటుంబాల జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల మాత్రమే కాదు.. భావోద్వేగంతో కూడిన లక్ష్యం కూడా. ఆ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది బ్యాంకుల నుంచి లక్షల రూపాయల రుణాలు తీసుకుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలా మంది కేవలం నెలసరి వాయిదా ఎంత వస్తుందనే విషయంపైనే దృష్టి పెడతారు. కానీ దీర్ఘకాలంలో అదే రుణం మీద చెల్లించాల్సిన వడ్డీ మొత్తం ఎంత పెద్దదిగా మారుతుందో చాలా మంది గుర్తించరు. సాధారణంగా 20 ఏళ్ల గడువుతో తీసుకున్న హోమ్ లోన్‌లో మనం కట్టే మొత్తం డబ్బులో అసలుకంటే వడ్డీయే ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని...