Education News: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పదో తరగతి ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
Education News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకొని, ముందుగా ప్రకటించిన సాధారణ సెలవు తేదీని సవరించింది. వక్ఫ్ బోర్డు సీఈఓ సమర్పించిన లేఖతో పాటు చంద్రుడి దర్శనం ఆధారంగా ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలుత ప్రకటించిన తేదీకి బదులుగా శనివారం రోజునే రంజాన్ పండుగ జరగనున్న నేపథ్యంలో, ఆ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు శనివారం మూసివేయబడతాయని స్పష్టం చేసింది. ముస్లిం సోదరుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ మార్పు ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న పదో...