Anushka Shetty: జేజమ్మ వివాహ వార్తలపై టీమ్ క్లారిటీ.. వయస్సు ప్రస్తావనపై ఆగ్రహం

Anushka Shetty: టాలీవుడ్‌లో ‘జేజమ్మ’గా ప్రత్యేక గుర్తింపు పొందిన అనుష్క శెట్టి వివాహంపై నెట్టింట జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఆమె త్వరలో ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించగా, ఈ అంశంపై తాజాగా ఆమె టీమ్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండిస్తూ, అనుష్క వ్యక్తిగత జీవితాన్ని అనవసరంగా సంచలనంగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతిరోజూ ఆమె వ్యక్తిగత విషయాలను హెడ్‌లైన్స్‌గా మార్చడం సరైన పద్ధతి కాదని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన వార్తా ప్రవర్తన అవసరమని సూచించింది. ప్రత్యేకంగా అనుష్క వయస్సు (44) ను ప్రతి పోస్టులో ప్రస్తావిస్తూ దానిని వివాదాస్పద అంశంలా...