Mosquito Control: 2 స్పూన్ల కొబ్బరి నూనెతో ఇంట్లో దోమలు మాయం
Mosquito Control: ఇప్పటి కాలంలో ప్రతి ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో దోమల బెడద ఒకటి. ఇవి కేవలం నిద్రను భంగం కలిగించడం మాత్రమే కాకుండా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దోమల నివారణ కోసం మార్కెట్లో లభించే అనేక రసాయన ఆధారిత ఉత్పత్తులను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ, అవి ప్రతి పరిస్థితిలో సమర్థవంతంగా పనిచేయవు. ముఖ్యంగా సోఫాల కింద, కుర్చీల వెనుక దాక్కున్న దోమలను పూర్తిగా తొలగించలేకపోవడం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ రసాయన ఉత్పత్తుల నుంచి వెలువడే పొగ, ఘాటైన వాసన శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇవి మరింత హానికరంగా...