Weather Alert: వచ్చే 3 రోజులు పిడుగులతో వర్షాలు

Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటం వల్ల వాతావరణంలో అస్థిరత నెలకొన్నదని ఆయన వివరించారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 3 రోజులు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతాంగం ఈ వర్షాల సమయంలో ప్రత్యేక...