IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ టికెట్ల విక్రయాలు ప్రారంభం
IPL 2026: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. తమకు ఇష్టమైన జట్ల మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని మార్పులు చోటుచేసుకోవడం విశేషంగా మారింది. ప్రతి జట్టుకు వేర్వేరు భాగస్వాములు ఉండటంతో టికెట్ల కొనుగోలు విధానం కొంత భిన్నంగా ఉంది. ఈ సీజన్‌లో టికెట్లను ప్రధానంగా ఆన్‌లైన్ వేదికల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. ముంబై ఇండియన్స్,...