KCR: గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా?
KCR: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. శుక్రవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవిగా భావిస్తారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నేతలు సభకు హాజరై బడ్జెట్‌పై చర్చించడం, లోపాలను సూచించడం, ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తడం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయన గైర్హాజరు...