Ugadi 2026: ఉగాది పండుగ విశిష్టత, పచ్చడి ప్రాముఖ్యత ఇదే..
Ugadi 2026: తెలుగు ప్రజల సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఉగాది ఒకటి. కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా భావించే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగతో కొత్త తెలుగు సంవత్సరానికి నాంది పలుకుతారు. ఈ ఏడాది వచ్చే తెలుగు సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం కాగా, ఉగాది పండుగ మార్చి 19న జరగనుంది. ఈ రోజు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం వంటి ఆచారాలు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న పురాణ...