Gurugram: దేశంలోనే తొలి ‘LPG గ్యాస్ ATM’

Gurugram: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక సంతోషకరమైన వార్త వెలువడింది. ఇప్పటివరకు సిలిండర్ బుక్ చేసిన తర్వాత డెలివరీ కోసం రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు ముగింపు పలుకుతూ, డబ్బులు తీసుకునే యంత్రంలా సులభంగా గ్యాస్ సిలిండర్ పొందే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఈ వినూత్న వ్యవస్థలో భాగంగా దేశంలో తొలి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎంను హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ సేవను సోహ్నా ప్రాంతంలోని సెక్టార్ 33లో ఉన్న సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ...