ICC Ranks: వన్డే టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు భారత స్టార్ ప్లేయర్లు

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి International Cricket Council తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో టాప్ 5లోనే ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు సంపాదించడం విశేషంగా నిలిచింది. గత కొన్ని నెలలుగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతుండగా, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచారు. మరోవైపు యువ ప్రతిభగా ఎదుగుతున్న శుభ్‌మన్ గిల్ ఐదో ర్యాంక్‌ను దక్కించుకుని తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకేసారి టాప్ 5లో ఉండటం...