CM Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే
CM Revanth Reddy: తెలంగాణ రాజకీయ భవిష్యత్తు, అలాగే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్ చేసిన సందర్భంగా పలు కీలక అంశాలను స్పష్టం చేశారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలకు ఆయన పూర్తిగా చెక్ పెట్టడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగే అవకాశం లేదని, జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్ర రాజకీయాల దిశపై కొత్త చర్చ...