Political Drugs: డ్రగ్ టెస్ట్‌కి ఎవరు రెడీ?

Political Drugs: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య ఇప్పుడు సాధారణ నేరంగా కాకుండా సమాజాన్ని లోపల నుంచి క్రమంగా కుదించే ప్రమాదకర వ్యాధిలా మారుతోంది. ఒకప్పుడు గోవా, ముంబై వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ దందా, గత 5-6 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది. యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన నేతలు ఒకవైపు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతుండగా, మరోవైపు ఫామ్‌హౌస్‌ల్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొనడం సమాజంలో తీవ్ర ఆవేదనను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే తరాలపై...