Pawan Kalyan: జనసేనలో అసలు ఏం జరుగుతోంది?.. వివాదాస్పదంగా ఆవిర్భావ వేడుకలు

Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈసారి అనుకున్న స్థాయిలో జరగకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చినప్పటికీ, అనేక ప్రాంతాల్లో స్పందన ఆశించినంతగా కనిపించలేదు. ముఖ్యంగా కార్యకర్తలు, స్థానిక నాయకులు వేడుకలకు దూరంగా ఉండడం, కొన్నిచోట్ల వేదికలపైనే విభేదాలు బయటపడటం వంటి పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై కూడా చర్చ మొదలైంది. మొదటిసారిగా పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా నాయకులు ఎవరికి వారు విడిగా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హంగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి...