Chennai Crime: ఆటోలో వెళ్తూ మహిళపై మూత్ర విసర్జన.. కొట్టి చంపిన జనం
Chennai Crime: చెన్నై నగరంలో చోటుచేసుకున్న ఒక ఘోర ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. మార్చి 11న జరిగిన ఈ సంఘటనలో మానవత్వాన్ని మరిచిపోయేలా ఒక వ్యక్తి ప్రవర్తించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత విషాదాన్ని మిగిల్చాయి. కలైసెల్వన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళపై అసభ్యకరంగా మూత్ర విసర్జన చేయడం జరిగింది. ఈ చర్య అక్కడి వారిని షాక్కు గురిచేసింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ వెంటనే కలైసెల్వన్ను నిలదీసింది. తన గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించడంపై ప్రశ్నించడంతో అక్కడ వాగ్వాదం ప్రారంభమైంది. ఈ గొడవ క్రమంగా...